జనతా కర్ఫ్యూ : ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు…? ఇవి చేసుకోండి ముందు…!

-

ఏంటీ…? జనతా కర్ఫ్యూ అనగానే తన్నిపెట్టుకుని పడుకుని ఉంటారు కదూ…? రోజు పడుకునే నిద్ర. రోజు వచ్చే నిద్ర కదా. వీక్ ఆఫ్ వస్తే చేసే పని అదేగా. ఒక్క నాడు అయినా రోజు తిరిగే కారు ఎలా ఉంది…? రోజు తిరిగే బండి ఎలా ఉంది…? వాకింగ్ కి వెళ్ళే ముందు అవే షూ. కనీసం సాక్సులు కూడా ఉతుక్కోవడం లేదు. టీవీ కొన్న నాలుగు రోజులు తుడిచి ఉంటారు. దాని మొహం చూసే నాధుడు లేడు ఇంట్లో.

ఆ బీరువా చూడండి ఎలా ఉందో. చెత్త బుట్ట నయం దానికంటే. ఆ కర్టెన్ ఉతికి ఎన్ని రోజులు అయిందో…? వాషింగ్ మెషిన్ బట్టలు ఉతికి శుభ్రం చేస్తుంది గాని దాని శుభ్రం లేదు. చెప్పుకుంటూ పోతే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు. రోజు ఉద్యోగం వ్యాపారం చదువు. కాబట్టి అందరూ కూడా ఇవాళ జనతా కర్ఫ్యూ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి అన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోండి.

వాలేట్ నిండా చెత్త ఉంటుంది. ఆఫీస్ కి వెళ్ళే బ్యాగ్ నిండా చెత్త ఉంటుంది. కాలేజి కి వెళ్ళే బ్యాగ్ నిండా చెత్త ఉంటుంది. ఇంట్లో అన్ని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. రోజు ఇంటికి రాగానే తినడానికి ఏమీ ఉండవు. కాబట్టి అమ్మకు హెల్ప్ చేస్తే ఏదొకటి వండి పెడుతుంది. ఆ ఫ్రిడ్జ్ లో పాత కూరలు, కూల్ డ్రింక్ బాటిల్స్ పెట్టి ఎన్ని రోజులు అయింది. తీసేయండి ముందు వాటిని. ఫ్రిడ్జ్ కవర్ ఎంత చికాకుగా ఉందో చూడండి. వాటర్ ప్యూరీఫైర్ నిండా దుమ్ము పట్టేసి ఉంటుంది.

దాన్ని శుభ్రం చేసుకోండి ముందు. ఫోన్ లో పాత అనవసర ఫోటోలు తీయడానికి ఉన్న టైం, ఇల్లు సర్దుకోవడానికి ఉండటం లేదు. హాల్ చక్కగా డిజైన్ చేసుకోండి. రోజు పడుకునే నిద్రే కదా మాస్టారు. ఇవాళ అయినా అన్నీ శుభ్రం చేసుకుందాం. రాక రాక వచ్చిన అవకాశం. ముందు చెప్పుల స్టాండ్ లో ఆ పనికి రాని చెప్పులు అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇంట్లో పాడైపోయిన వస్తువులు అన్నీ తీసి పక్కన పెట్టేయండి. జనతా కర్ఫ్యూ ఇలా విజయవంతం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version