బాలీవుడ్ నిత్య ప్రేమికుడు రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణం సాగించి.. అప్పట్లో హల్చల్ చేశాడు. పెళ్లి పీఠల వరకు వెళ్లిన వ్యవహారాలు ఆఖరి నిమిషంలో తారుమారయ్యాయి. దీపికా, కత్రినాతో బ్రేకప్ అనంతరం మరో బ్యూటీని లైన్‌లో పెట్టేశాడు.
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అలియా భట్‌తో రణ్‌బీర్ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీరిద్దరూ గత కొన్నిరోజులుగా చెట్టాపట్టాలేసుకుని వీర విహారం చేస్తున్నారు. ఎక్కడా చూసినా వీరిద్దరి హంగామానే. ప్రస్తుతం వీరిద్దరు బ్రహ్మాస్త్ర సినిమాలో కలిసి నటిస్తున్నారు.
తాజాగా అలియా భట్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన స్నేహితుల మధ్య చేసుకున్న ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో ప్రియుడు రణ్‌బీర్ లేకపోయే సరికి కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి.
ఇద్దరికీ గొడవలు అయ్యాయని, అందుకే బర్త్ డే వేడుకల్లో రణ్‌బీర్ కనిపించలేదని వార్తలు వండారు. అయితే వీటిపై అలియా తెలివిగా సమాధానమిచ్చింది. తెల్లవారు ఝామున సూర్యోదయాన్ని వీక్షిస్తున్న తన ఫోటోను అలియా షేర్ చేసింది. అందులో ఈ పిక్ తీసింది తన ఆల్ టైమ్ ఫేవరేట్ రణ్‌బీర్ కపూర్ అంటూ పేర్కొంది. దీంతో తామిద్దరం కలిసే ఉన్నామనే హింట్ ఇచ్చి.. బ్రేకప్ వార్తలకు పుల్ స్టాప్ పెట్టేసింది. అలియా ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది.