జనవరి 31 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ జనవరి – 31- ఆదివారం. పుష్యమాసం.

 

మేష రాశి:పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశం పొందుతారు. వ్యాపారాల్లో వృత్త పెట్టుబడులు పెట్టి అధిక ధనలాభం పొందుతారు. ఆఫీసుల్లో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అవసరానికి చేతుకి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు నారాయణ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీలు అప్రమత్తంగా ఉండడం మంచిది, విలువైన వస్తువులు పడిపోయే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి, గోధుమలను ఎవరికైనా దానం చేసుకోండి.

 

మిధున రాశి:అధిక ధనలాభం పొందుతారు !

ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంది అధిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకుని అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. నూతన గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. మిత్రుల వల్ల శుభవార్తలు వింటారు.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు శుభకార్యాన్ని తలపెడతారు !

ఈరోజు శుభ యోగంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల ఆర్థిక లాభం పొందుతారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించి ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అధిక ధనలాభం పొందుతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. భార్యా భర్తల మధ్య గొడవలు తగ్గిపోయి ఒకరికొకరు అన్యోన్యంగా, సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:వ్యాపార లాభాలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. వ్యాపార లాభాలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉంది చదువు మీదనే శ్రద్ధ వహించడం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఎరపడే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకపోవడం మంచిది లేదంటే ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు గోధుమలను బ్రాహ్మణుడికి దానం  చేసుకోండి.

 

తులారాశి:ఈరోజు అధిక లాభాలు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి ధన లాభం పొందుతారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నూతన ఉద్యోగాలకు అర్హులు అవుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:ఆస్తి పంపకాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. పెద్దవారి మాటలను సూచనలను పాటిస్తారు. సోదరుల మధ్య ఆస్తి పంపకాలు అనుకూలిస్తాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి, స్వామివారికి దీపారాధన చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు గౌరవాన్ని పొందుతారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా కలిసిమెలిసి ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. సమయానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన అధిక ధన ప్రాప్తి పొందుతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. నిరుద్యోగులుకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది.

పరిహారాలుః శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:దంపతుల మధ్య విభేదాలు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. దంపతుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. అనవసరంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి, తక్కువ మాట్లాడడం మంచిది.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 కుంభరాశి:ఈరోజు ఉన్నత విద్యను పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉన్నత విద్యను పొందుతారు. పెద్దవారిని గౌరవిస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. గోసేవ చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కలిసొస్తాయి.

పరిహారాలుః ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించండి .

 

మీన రాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రునాశనం పొందుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అధిక ధన వృద్ధి పొందుతారు. సమయానికి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఇంతకుముందు ఉన్న చాలా రకాల ఇబ్బందుల నుంచి బయట పడతారూ. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version