నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యల్లో ఉపయోగపడుతుంది. బ్యూటీ టిప్స్ గా కూడా ఇది మంచి బెనిఫిట్ అందిస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ ను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఇది బాగా సహాయ పడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా లెమన్ వాటర్ ఉపయోగపడతాయి. అయితే లెమన్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి వాటిని ఇప్పుడే చూసేయండి..
పరగడుపునే మీరు నిమ్మరసం తీసుకుంటే ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది యురినేషన్ ని పెంచి కిడ్నీలను కూడా శుభ్రపరుస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది సహాయ పడుతుంది. అలానే జలుబు, దగ్గు వంటి సమస్యలే కాకుండా ఆస్త్మా మరియు అలర్జీతో బాధపడే వాళ్లు కూడా దీన్ని తీసుకుంటే దివ్యౌషధంలా పని చేస్తుంది. ఉదయాన్నే నిమ్మ రసం తాగడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనం కలుగుతుంది. వయసు పై బడిన వారు కూడా యవ్వనంగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది. మచ్చలు ముడతలు వంటివి తగ్గిస్తుంది.