భారత్ లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్నారు. 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఈ జపాన్ ఇండియాలో రూ.3.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. సైబర్ భద్రతపై సహకారానికి సుస్థిర అభివృద్ధి రంగంలో సహకారానికి, మురుగునీటి నిర్వహణపై పలు ఒప్పందాలు కుదిరాయి. కనెక్టివిటీ, హెల్త్ కేర్, నీటి సరఫరా మొదలైన అంశాల్లో జపాన్ తో ఇండియా రుణ ఒప్పందాలు చేసుకుంది.
భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న జపాన్… ఐదేళ్లలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
-