రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. గ్రూప్-1, గ్రూప్-2 నియామ‌కాలకు ఇంట‌ర్వ్యూలు

-

గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ -1, గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియాలో ఇంట‌ర్వ్యూ ప‌ద్ద‌తిని కొన‌సాగించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ – 1, గ్రూప్ – 2 ప‌రీక్షలు మిన‌హా మిగిత అన్ని ప‌రీక్షల‌కు ఇంట‌ర్వ్యూ ఉండ‌ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియాలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్వ్యూల‌ను ఎత్తేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కాగ ఈ వార్త‌ల‌ను అన్నింటిని కొట్టి పరేస్తు… తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రూప్ -1. గ్రూప్ – 2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియాలో మొద‌ట ప్రిలమ్స్, మెయిన్స్ ప‌రీక్షలు ఉండ‌నున్నాయి. వీటి త‌ర్వాత‌.. ఇంట‌ర్వ్యూలను టీఎస్పీఎస్సీ నిర్వ‌హించ‌నుంది. మెయిన్స్ పరీక్షతో పాటు ఇంట‌ర్వ్యూలో అత్య‌ధిక మార్కులు పొందిన అభ్య‌ర్థుల‌ను టీఎస్పీఎస్సీ ఎంపిక చేయ‌నుంది. వారికి మాత్రమే ఉద్యోగాలు రానున్నాయి. కాగ రాష్ట్రంలో పోలీసు, వైద్య, విద్య శాఖ‌ల్లో ఉన్న ఖాళీల‌ను ఆయా శాఖ‌లే భ‌ర్తీ చేయ‌నున్నాయి. కానీ ఇత‌ర శాఖ‌ల్లో ఉన్న ఉద్యోగాల‌ను టీఎస్పీఎస్సీ భ‌ర్తీ చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version