టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు జస్ప్రీత్ బుమ్రా. ఆసియా కప్ కోసం తాను సిద్ధంగా ఉన్నానంటూ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి బుమ్రా తెలిపినట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే సెలక్షన్ కు తాను అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా ఆసియా కప్ కు మొదట దూరం అవుతాడని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

కానీ బుమ్రాను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ నెల 19న జట్టును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ బుమ్రా నిజంగానే ఆట ఆడినట్లయితే చాలా బాగుంటుందని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈనెల 19వ తేదీన జట్టును ప్రకటించిన తర్వాత ఎవరెవరు ఆటను ఆడుతారో తెలుస్తోంది.