మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చాలామందికి అలసట, బద్దకం, నిద్ర ఎక్కువగా వస్తుంది. ఇది ఆఫీసులో పనిచేసే వారి కైనా, వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారి కైనా సహజంగా వచ్చే సమస్య.దీన్ని ఆఫ్టర్నూన్ స్లమ్ప్ అంటారు. ఇది సహజమైందే కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మధ్యాహ్నం కూడా ఉల్లాసంగా గడపవచ్చు. మరి ఆ చిన్న చిట్కాలను మనము తెలుసుకుందాం..
ఆహారం తినే విధానం: ఉదయం అల్పాహారం తిన్న తర్వాత చాలామంది మధ్యాహ్నం చాలా లేటుగా లంచ్ చేస్తారు, మనం తినే టైం మనం తినే విధానం, మనకుండే బద్ధకాన్ని పోగొడుతుంది. లంచ్ సమయంలో ఎక్కువ బియ్యం, మసాల, ఫ్రై ఐటమ్స్ తింటూ ఉంటారు. ఇది జీర్ణ క్రియను నెమ్మదిస్తుంది దాంతో శరీరం అలసటగా మారుతుంది. అందుకే లంచ్ టైం లో తేలికపాటి ఆహారం కూరగాయలు, పప్పు పెరుగు వంటివి ఎక్కువగా చేర్చుకొని, వైట్ రైస్, మసాలా తగ్గించాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.

లంచ్ తరువాత నడక: మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత వెంటనే కూర్చోవడం లేదా కొందరు పడుకోవడం చేస్తారు ఇది చాలా తప్పు ఇలా చేస్తే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం ఐదు నుంచి పది నిమిషాలు నడవడం చాలా మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరిచి శరీరాన్ని తేలిగ్గా మారుస్తుంది. ఆ తరువాత 10 నుండి 15 నిమిషాలు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.
నీరు తీసుకోవడం : ఎక్కువమంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నీరు తాగడం మానేస్తారు. లేదా కొందరు భోజనంతో పాటే నీటిని తీసుకోవడం చేస్తారు. మనం భోజనం చేసిన తరువాత శరీరాన్ని కావలసినంత నీరు తాగడం ముఖ్యం. తగినంత నీరు తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది, అలసట తగ్గుతుంది.
కాఫీ టీ తాగడం: మధ్యాహ్నం లంచ్ తర్వాత కాఫీ, టీ లాంటివి వెంటనే సేవించకూడదు. బదులుగా ఏదైనా ఫ్రూట్ జ్యూస్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
ఇక మొత్తం మీద లంచ్ తర్వాత బద్ధకం సహజం.అయిన ఆహారంలో చిన్న మార్పులు అలవాట్లలో జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు మధ్యాహ్నం కూడ చురుగ్గా, ఉల్లాసంగా గడపవచ్చు.