ప్రేక్షకుల హృదయాలను హైజాక్ చేసిన “విక్రమ్ రాథోడ్”…!

-

తమిళ డైరెక్టర్ అట్లీ మరియు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా “జవాన్”, ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యి మూవీ మేకర్స్ కు అధిక లాభాలను తెచ్చిపెట్టింది. ఆ విధంగా థియేటర్ లలో కలెక్షన్ ల రికార్డు నెలకొల్పిన జవాన్..ఇప్పుడు ఓటిటి లోనూ తన సత్తా చూపిస్తోంది. జవాన్ మూవీ నవంబర్ 2వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. విడుదల అయిన రోజున నుండి ఇప్పటి వరకు చాలా రికార్డ్ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల కలెక్షన్ లను అందుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన జవాన్ అత్యధిక వ్యూస్ ను సృష్టిస్తూ మరో రికార్డు కు చేరుకుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓటిటి లో రిలీజ్ అయిన రెండు వారాలకు గాను అత్యధిక వ్యూస్ ను అందుకున్న చిత్రంగా అన్ని భాషలలోనూ రికార్డు అందుకుంది. ఇంకా ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులను తన పేరిట రాసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version