టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి ?

-

టీటీడీ ఈవోగా సుధీర్ఘ కాలం విధులలో కొనసాగిన అనిల్ కుమార్ సింఘాల్ ను వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా బదిలీ చేయడంతో ఇప్పుడు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ వి ధర్మారెడ్డికి ఈఓ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈఓ నియామకం పై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని వెల్లడించారు.

ఇక ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. అందుతున్న సమాచారం మేరకు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు. అక్టోబర్ 8 లేక 9వ తేదీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తిరుమల డిక్లరేషన్ అంశంలో వచ్చిన వివాదాన్ని ఈయన సరిగా హ్యాండిల్ చేయలేక పోయారని భావిస్తున్న ప్రభుత్వం ఈ బదిలీ నిర్ణయం తీసుకుని ఉండచ్చని అంటున్నారు. అయితే ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version