ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదని…క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని అపహాస్యం చేస్తున్నాడని మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ పరిపాలన కొనసాగుతుందని..ఏ మతం ధర్మం మీద కూడా జగన్ కి విశ్వాసం లేదని ఫైర్ అయ్యారు.
ముస్లింలకి షాదీ ముబారక్ లేదని..బ్రింగ్ బ్యాక్ బాబు అని నినాదం తో మన ముందుకు వెళ్లాలన్నారు.చంద్రబాబు నాయుడు పరిపాలన లోనే అన్ని కులాల వారికి అన్ని మతాలు వారికి సమ న్యాయం జరుగుతుందని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులుల కుప్పగా తయారయిందని ఓ రేంజులో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని మాజీ మంత్రి జవహర్ పేర్కోన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఇబ్బందుల్లో పడుతుందని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.