శశికళ చేతిలో నా తమ్ముడు కీలుబొమ్మ : జయలలిత మేనకోడలు

-

శశికళ చేతిల తన తమ్ముడు దీపక్‌ కీలుబొమ్మగా మారాడని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు. జయలలిత మృతిపై అనుమానం ఉందని ఆరుముగస్వామి కమిషన్‌ నిర్ధారించింది. శశికళ, మాజీ మంత్రి విజయభాస్కర్‌లపై ఆరోపణలు వచ్చాయి. న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆరోపణలను శశికళ కొట్టివేశారు.

ఈ నేపథ్యంలో జయలలిత వారసుడిగా న్యాయస్థానం ప్రకటించిన జయలలిత మేనల్లుడు దీపక్‌ జయలలిత మరణంలో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు దీపక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు శశికళ కబంధ హస్తాల్లో ఉన్నాడని దీప తెలిపారు. దీని గురించి విడుదల చేసిన ఆడియోలో తన సొంత తమ్ముడిని తనకు వ్యతిరేకంగా మార్చి శశికళ తన గుప్పిట్లో పెట్టుకుందని చెప్పారు.

విలాసవంతమైన జీవితం గడిపేందుకు, రాజకీయ పలుకుబడి కోసమే శశికళ తన మేనత్త జయలలిత దగ్గర ఉన్నారని తెలిపారు. శశికళ సూచన మేరకు దీపక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ తాను అక్కడే ఉన్నానని దీపక్‌ చెబుతున్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఎందుకు ఆ విషయాలు మీడియాతో పంచుకోలేదని ప్రశ్నించారు. ఈ విచారణను ఎవరు అడ్డుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిజాయతీగా జరపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version