జేఈఈ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా!

-

జేఈఈ మెయిన్స్‌ ఎగామ్స్‌ వాయిదా పడ్డాయి. పెరుగుతున్న కొవిడ్‌ బాధితుల సందర్భంగా జేఈఈ మెయిన్స్‌ 2021ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సెకండ్‌ వేవ్‌ ఉధృతికి వరుసగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల రక్షణ కోసమే పరీక్షలు పోస్ట్‌పోన్‌ అయింది.

వరుసగా మే 24–28 వర కు జరగాల్సి ఉంది. ఎగ్జామ్‌ తదుపరి రిజిస్ట్రేషన్‌కు త్వరలో రీషెడ్యూల్‌ చేయనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్టర్‌లో తెలిపారు. అదేవిధంగా తర్వాతి ప్రకటన కోసం విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు వారు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. అదే విధంగా పరీక్షలు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సన్నద్ధం కావాలని, ఇంకా మెరుగుపరచుకోవాలని ట్వీట్టర్‌ వేదికగా విద్యా మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతే కాకుండా పరీక్షల ప్రాక్టిస్‌ కోసం ఎన్‌టీఏ అభ్యాస్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version