కేసీఆర్ మీద అనుమానం.. తెలంగాణ బిడ్డనో కాదో ?

-

టీఆర్ఎస్ తాబేదారులకు యూనివర్సిటీ లు తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లెవ్వు కానీ…కేసీఆర్ ఇంట్లో అందరికి ఉద్యోగాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ మీద తెలంగాణ బిడ్డవో కాదో అని అనుమానం ఉందని ఆయన అన్నారు. చేసే పనులు కూడా అలాగే ఉన్నాయన్న ఆయన మొన్న ఎన్నికల్లో కూడా సెటిలర్లు ఉన్న చోటే trs గెలిచిందని నిజమైన తెలంగాణ బిడ్డలు ఉన్న చోట మాత్రం గెలవలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కి. చిన్న బాస్ కి సలహా దారులు అంతా ఆంధ్రా వాళ్లే ..సమైక్య వాదులేనని ఆయన అన్నారు.

ఆపిల్..అమెజాన్ కంపెనీల్లో  తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఎంత మందో చెప్పు..? అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. అమెజాన్ తో సర్కార్ కి ఆదాయం వచ్చిందేమో కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదని ఆయన అన్నారు. ఏపీలో సొంత రాష్ట్రం వారికే ఉద్యోగాలు అంటుంటే…ఇక్కడ మాత్రం ఆ ఊసే లేదని అన్నారు. తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది ? దొర పాలన కోసమా..?  గడీల పాలన కోసం కొట్లాడినట్టే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ ను విభేదించిన చోటే trs గెలిచిందని సెటిలర్లు మాత్రమే గెలిపించారని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version