బీజేపీ స్కాముల పార్టీ… టీఆర్ఎస్ స్కీముల పార్టీ- జీవన్ రెడ్డి

-

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ స్కాముల పార్టీ అని.. టీఆర్ఎస్ స్కీముల పార్టీ అని ఆయన అన్నారు. ఫాదర్ ఆఫ్ కరెప్షన్ గా బీజేపీ ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అవినీతి లేదని కేంద్రమే చెప్పింది. జేపీ నడ్డా సోయి తప్పి మాట్లాడుతున్నారని.. మాటలు విత్ డ్రా చేసుకోకుంటే.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు.

బిడ్డా… నడ్డా తెలంగాణలో నీ నకరాలు నడవవు. ఇక్కడ బకరాలు ఎవరూ లేరని అన్నారు. మిషన్ భగీరథ పై తెలంగాణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరూ నమ్మరని అన్నారు. బీజేపీ గాంధీని తిడుతారని.. విమర్శించారు. తెలంగాణ ఉద్యమంతో బీజేపీ నేతలకు ఎవరికి సంబంధం లేదు. కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని తెలిపాడు. రైతుల కిల్లర్స్ పార్టీగా బీజేపీ అభివర్ణించాడు. తెలంగాణ అభివ్రుద్ధి గురించి నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి తెలుసుకోవాలన్నారు.

రెండురోజుల గురించి ప్రశాంతంగా ఉందని.. అరవింద్, బండి సంజయ్ మీద పీడీ యాక్ట్ లు పెట్టాలని డిమాండ్ చేశారు. మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 2012 నుంచి బండి సంజయ్ పై కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version