అమెరికా 39వ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత

-

అగ్రరాజ్యం అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలు అందించిన జిమ్మీ కార్టర్ ఇకలేరు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన 100 ఏళ్ల వయసులో జార్జియాలోని ప్లెయిన్స్‌ పట్టనంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియడంతో అమెరికా ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షడు జిమ్మీ కార్టర్ గొప్ప మానవతావాది. అంతర్జాతీయ సంఘర్షణల పరిష్కారంలో తను మానవత్వంతో చాలా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేశాడు. అందుకు గాను 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదిలాఉండగా, అమెరికా శ్వేతసౌధం ఆయన మృతికి ఘన నివాళ్లు అర్పించింది. కాగా, ఈనెల 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news