నేను సీఎం అని మన్మోహన్‌ భార్యను పరిచయం చేసుకున్నా – రేవంత్‌

-

నేను సీఎం అని మన్మోహన్‌ భార్యను పరిచయం చేసుకున్నా అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం మాట్లాడారు.

revanth

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోగానే ఆయన సతీమణి దగ్గరికి వెళ్లి నేను రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిని అని పరిచయం చేసుకొని మాట్లాడానని ఇవాళ పేర్కొన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.
ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించండి అని ఆమె చెప్పారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news