జెఎన్‌యూలో ఘర్షణ… నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న స్టూడెంట్ యూనియన్స్

-

ఢిల్లీ జెఎన్‌యూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏబీవీపి, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్ల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. రెండు స్టూడెంట్ యూనియన్లు కొట్టుకున్నాయి. ఆదివారం రాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీ రామ నవమి సందర్భంగా హాస్టల్ లో మాంసాహారం తినవద్దని ఏబీవీపీ డిమాండ్ చేసింది… అయితే ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ఘర్షనకు దారి తీసింది. ఈ ఘర్షణలో 15 మంది వరకు గాయపడ్డారు. జెఎన్‌యూ కావేరి  హాస్టల్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. అయితే లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్, ఏబీవీపీ వాళ్లు నాన్ వెజ్ తినకుండా అడ్డుకుంటున్నారని… మెనూ ప్రకారం వీకెండ్ లో నాన్ వెజ్ ఉంటుందని.. మా తినే హక్కును ఏబీవీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్లు ఈ ఇలా చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని…వారిని హాస్పిటల్ కు తరలించామని, మొత్తం 15 మంది దాకాా గాయపడ్డారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version