IPL 2022 : ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా అశ్విన్ రికార్డు

-

ఐపీఎల్ 2022 లో భాగంగా లక్నో సూప‌ర్ జెయింట్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య 20 మ్యాచ్ ఆదివారం జ‌రిగిన సంగతి తెలిసిందే. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్క‌ఠ‌గా సాగిన మ్యాచ్ లో గెలుపు రాజ‌స్థాన్ నే వ‌రించింది. రాజ‌స్థాన్ విధించి 165 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌డంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తడ‌ప‌డింది. చివ‌రి ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. స్టోనీస్ – అవేశ్ ఖాన్ 11 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. దీంతో ఈ మ్యాచ్ రాజ‌స్థాన్ వైపు తిరిగింది.

 

అయితే.. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. లక్నో పై 23 బంతుల్లో 28 పరుగులు చేసి.. ఫామ్‌ లో ఉన్న అశ్విన్‌ 18.3 ఓవర్ లో సడన్‌ గా మ్యాచ్‌ నుంచి వెళ్లి పోయాడు. దీంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ తర్వాత వచ్చిన పరాగ్ చివరి 10 బంతులు ఆడి టీంకు మంచి స్కోర్‌ అందించాడు. అయితే.. ఏ బ్యాట్స్‌ మెన్‌ అయినా అంపైర్‌ అనుమతి లేకుండా.. రిటైర్‌ చేసి.. మరల తిరిగి ఆటను ప్రారంభించకపోతే..వారిని అంపైర్లు రిటైర్డ్‌ అవుట్‌ గా పరిగణిస్తారు. మంచి స్కోర్‌ తో ఉన్న అశ్విన్‌ ఇలా వెళ్లి పోయి.. ఐపీఎల్‌ చరిత్రలో నిలిచిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version