భారీ వేతనంతో హెచ్‌పిసిఎల్ లో ఉద్యోగ అవకాశాలు.. పూర్తీ వివరాలు..

-

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. హెచ్‌పిసిఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ విశాఖ రిఫైనరి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తుంది. అన్ని విభాగాల్లో కలిపి 186 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారం, అప్లికేషన్ విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 21, 2022 వరకు అవకాశం ఉంది.

ఈ పోస్టుల వివరాలు..

ఆపరేషన్స్ టెక్నిషియన్‌ 94

బాయిలర్ టెక్నిషియన్‌ 18

మెయింటెనెన్స్ టెక్నిషియన్ (మెకానికల్‌) 14

మెయింటెనెన్స్ టెక్నిషియన్ (ఎలక్ట్రికల్‌) 17

మెయింటెనెన్స్ టెక్నిషియన్ (ఇనుస్ట్రుమెంటేషన్) 09

ల్యాబ్ అనలిస్ట్ 16

జూనియర్ ఫైర్ అండ్ సెఫ్టీ ఇన్ స్పెక్టర్ 18

అర్హతలు..

డిప్లొమా, బీఎస్సీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, వాలిడ్ హెచ్ఎంవీ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ ను నిర్వహిస్తారు.

ఎంప్లాయిమెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం..

కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్‌/ టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. సీబీటీలో అర్హులైన అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం..

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

ముందుగా అధికారిక వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/job-openings లోకి వెళ్లాలి.

నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదవాలి.

Click here to Apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

క్లిక్ చేసిన తరువాత https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp లింక్‌లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీ పూర్తి సమాచారం ఇచ్చి ఫాం నింపాలి.

తప్పులు లేకుండా అప్లికేషన్ ఫాం నింపాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. ఇతర అభ్యర్థులక రూ. 590+ఇతర చార్జీలతో కలిపి ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి మే 21, 2022 వరకు అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version