ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉద్యోగాలు… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వం తాజాగా రిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూడ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేస్తోంది.

jobs

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (60), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (10) ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల్లో భాగంగా జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆనెస్తీషియా ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ప్యాస్ అయ్యి ఉండాలి. అదే విధంగా టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అదే ఒకవేళ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజస్టర్‌ అయి ఉండాలి.

వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూస్తే.. ఎంబీబీఎస్‌/ మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) మెరిట్‌ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ కి రావాల్సి ఉంటుంది. శాలరీ వివరాలలోకి వెళితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు రూ. 52,000 చెల్లిస్తారు. 11-04-2022 తేదీని ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పూర్తి వివరాలను http://rimsadilabad.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version