మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఇది మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఏపీ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 8, 2021. కనుక ఈలోగా అప్లై చేసుకోచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఏపీపీఎస్‌సీ. రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్‌సీ తర్వాత ప్రకటిస్తుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..
ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
New Registration పైన క్లిక్ చేయాలి.
ఇక్కడ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. దానితో లాగ్ ఇన్ అయ్యి పాస్వర్డ్ పెట్టుకోవాలి.
తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
లాగిన్ చేసి.. పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.