గుడ్ న్యూస్ : ఒమిక్రాన్‌పై మెడిసిన్ గుర్తించిన బ్రిటన్ !

-

దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన ఓమీక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకు పాకే సింది. దీంతో ప్రపంచ దేశాలు గడగడలాడించి పోతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాలకు బ్రిటన్ శుభ వార్త చెప్పింది. ప్రపంచానికి మొదలైన కొత్త టెన్షన్ ఓమీక్రాన్.. వేరియంట్ పై భయపడాల్సిన పని లేదని.. కొత్త వేరే ఇంటిపై పని చేసే ఔషధాన్ని గుర్తించినట్లు బ్రిటన్ దేశం ప్రకటన చేసింది.

ఈ మెడిసిన్ పేరు..” సొట్రోవిమాబ్” అని తెలిపింది బ్రిటన్. ఫార్మా దిగ్గజం గ్యాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబు… ఉపయోగించడానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సొట్రోవిమాబ్… ఇంజక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా.. వారిలో మంచి ఫలితాలు కనిపించాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ ఇంజెక్షన్ తో 79% మరణించే ప్రమాదం తగ్గినట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. దీంతో ఈ ఔషధాన్ని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version