హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌ లోని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే.. హైదరాబాద్‌ లోని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 45 పోస్టులు వున్నాయి. ఈ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు కి దరఖాస్తు చేసేయచ్చు.

ఆక్యురియల్‌, ఫైనాన్స్‌, లా, ఐటీ, రిసెర్చ్‌, జనరలిస్ట్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీ వున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి మే 10, 2023వ తేదీ దాకా ఛాన్స్ వుంది. కనుక ఈ లోగా మీరు ఈ పోస్టుల కి అప్లై చెయ్యచ్చు.

రూ.750లు అప్లికేషన్‌ ఫీజు గా కట్టాల్సి వుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, డిస్క్రిప్టివ్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల కి కనుక ఎంపికైతే నెలకు రూ.45,500ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలు ని https://irdai.gov.in/notifications/vacancies లో చూసి అప్లై చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version