టెన్త్ ప్యాస్ అయినవాళ్లకు గుడ్ న్యూస్..ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటెలిజెన్స్‌ బ్యూరో దేశ వ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

jobs

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1,521 ఉండగా.. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ 150 వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు ఉండాలి. అదే ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు ఉండాలి. దాటి వుండకూడదు.

ఈ పోస్టులకి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. టైర్‌ 1, టైర్‌ 2, టైర్‌ 3 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే 25-11-2022ని చివరి తేదీ లోగ అప్లై చేసుకోవాలి. 05-11-2022న ప్రక్రియ మొదలు కానుంది. ఇక దరఖాస్తు ఫీజు చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 50, మిగిలిన వాళ్లకయితే రూ. 500 గా వుంది. పూర్తి వివరాలను https://www.mha.gov.in/ ద్వారా చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version