టెన్త్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ 2022-23 బ్యాచ్ కోసం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

indian-navy

డిసెంబర్ 5, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ 14 డిసెంబర్. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే.. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, కార్పెంటర్ వంటి ఖాళీలున్నాయి.

మొత్తం 275 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో 10వ తరగతి / SSC / మెట్రిక్ ఉత్తీర్ణులై ఉండాలి.

అలానే NCVT లేదా SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్ ఉండాలి. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో 5 డిసెంబర్ 2021లోపు అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌ లో మరిన్ని వివరాలని చూడచ్చు. http://www.apprenticeshipindia.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version