పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం ఉన్నట్టు తెలుస్తుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను గద్దే దించాలని పాక్ ఆర్మీ భావిస్తున్నట్టు సమాచారం. ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి దించడానికి సైనిక తిరుగుబాటు అయినా చేయడానికి పాక్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో పీటీఐ తో పాటు ముతైహిదా ఖౌమీ మూమెంట్ (ఎంక్యూఎం) తో పాటు పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్ – క్యూ) అనే రెండు పార్టీలు ఉన్నాయి.
ఈ రెండు పార్టీ లను కూడా సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా సూచించినట్టు తెలుస్తుంది. దీంతో ఎంక్యూఎం తో పాటు పీఎంఎల్ – క్యూ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం నుంచి త్వరలో వైదోలుగుతన్నట్టు తెలుస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవీ నుంచి తప్పు కోకుంటే సైనిక తిరుగుబాటు చేయడానికి అయిన జావేద్ బజ్వా సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగ గత కొద్ది రోజుల క్రితం ఐఎస్ఐ కి కొత్త చీఫ్ విషయం లో ప్రధాని కి పాక్ ఆర్మీ చీఫ్ కు మధ్య మనస్ఫార్థాలు వస్తున్నాయి. దీంతో ప్రధానిని ఎలాగైన గద్దె దించాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా భావిస్తున్నట్టు సమాచారం.