విజయనగరం కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు… రాత పరీక్ష లేకుండానే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పలు పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది.

ఈ పోస్టుల కి అప్లై చెయ్యాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ ని పూర్తి చేసి ఉండాలి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఏప్రిల్‌ 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హత వున్న వాళ్లు అప్లై చేసుకో వచ్చు.

ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చెయ్యచ్చు. లేదంటే మీరు ఆఫ్‌లైన్‌లో పోస్టు ద్వారా కూడా ఈ పోస్టుల కి అప్లై చెయ్యచ్చు. ఇక ఎలా ఎంపిక చేస్తారో చూస్తే.. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సాలరీ వచ్చేసి నెలకు రూ.22,500ల వరకు ఉంటుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌ అడ్రెస్ కి పంపాలి. పూర్తి వివరాలని https://vizianagaram.ap.gov.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version