ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపణలపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున

-

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఇంకా తగ్గలేదు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్సిపి నేత సందీప్ తన అనుచరులతో వచ్చి ఎమ్మెల్యే ప్రచార రథాన్ని అక్కడినుండి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2019 ఎన్నికల సమయంలో తామంతా చందాలు వేసుకుని ప్రచార వాహనాన్ని కొనుగోలు చేసి శ్రీదేవికి ఇచ్చామన్నారు సందీప్.

ఆ ప్రచార వాహనం తన సోదరి పేరుపై ఉందని చెప్పడంతో పాటు డాక్యుమెంట్ లు చూపడంతో ఆ వాహనాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే తన వాహనం పోయిందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ఆరోపణలపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. సీఎం జగన్ దయవల్లే శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. శ్రీదేవి కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమె చెప్పాలన్నారు.

శ్రీదేవి ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి స్వయంకృపరాధమని ఆయన పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదని అన్నారు. ఆమెకు వైసిపి సానుభూతిపరుడు వెహికల్ కూడా ఇచ్చారని.. కానీ ఎమ్మెల్యే పార్టీ నైన్ దాటడంతో వెహికల్ తీసుకున్నారని, ఇందులో దౌర్జన్యం ఏమీ లేదని అన్నారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన కారును దాని యాజమాని తీసుకొని వెళ్ళిపోతే తప్పేంటని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version