టెన్త్‌, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం కూడా ఎక్కువే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. కొకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు లో మొత్తం 77 ఖాళీలు వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే..

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారి వయస్సు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల వివరాలని చూస్తే.. డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ఎడిటర్‌, కెమిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హత విషయానికి వస్తే.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఖాళీల వివరాలని చూస్తే.. డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు 6, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 3,
స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 1, డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 13 వున్నాయి. అలానే
మార్కెట్ ప్రమోషన్ పోస్టులు 1, మాస్ మీడియా ఆఫీసర్ పోస్టులు 1, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు 9, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు 2, సబ్ ఎడిటర్ పోస్టులు 2, లోయర్‌ డివిజన్ క్లర్క్ పోస్టులు 14 వున్నాయి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్‌ 23, 2022 వరకే అవకాశం వుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే… జనరల్ అభ్యర్ధులు రూ.300లు పే చెల్లించవల్సి ఉంటుంది. అదే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. పోస్టుని బట్టీ సాలరీ ఉంటుంది. నెలకు రూ.19,900ల నుంచి రూ.2,08,700ల వరకు ఇస్తారు. పూర్తి వివరాలను https://coconutboard.gov.in/Vacancy.aspx లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version