ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టే నూతన అధ్యక్షుడు జో బిడెన్… సోమవారం ప్రకటన చేయబోయే కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో భారత సంతతి వైద్యుడు ఉండే అవకాశం ఉంది. ఇండో -అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ లో తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి కర్ణాటకకు చెందిన వివేక్ మూర్తి (43) ను అమెరికా 19 వ సర్జన్ జనరల్ గా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2014 లో నియమించారు.
కరోనా వైరస్ పై టాస్క్‌ఫోర్స్ ను సోమవారం ప్రకటించనున్నట్లు జో బిడెన్ తెలిపారు. “సోమవారం, బిడెన్-హారిస్ కరోనా వైరస్ ఉమ్మడి ప్రణాళికను తీసుకొని 2021 జనవరి 20 న ప్రారంభమయ్యే యాక్షన్ ను బ్లూ ప్రింట్ గా మార్చడానికి గానూ సహాయంగా ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు నిపుణుల బృందాన్ని సలహాదారులుగా పేరు పెడతాను” అని జో బిడెన్ పేర్కొన్నారు. అయితే కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారో ప్రకటించలేదు.