జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్లో ఎదురుగా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా అందులో ఒక ఆర్మీ కెప్టన్ అలానే ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అయితే మన భద్రతా దళాలు కూడా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సమాచారం అందుతోంది. ఇక ఒక కానిస్టేబుల్ కూడా మరణించినట్టు ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.
ఇండియన్ ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీసులు చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక నిన్న రాత్రి భారీగా పేలుడు పదార్ధాలతో వెళ్తున్నట్టు కొందరిని ఆర్మీ గుర్తించడంతో ఈ ఎన్ కౌంటర్ మొదలు అయినట్టు చెబుతున్నారు. అలానే ఒక టెర్రరిస్ట్ ని చంపిన చోట భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, రెండు బ్యాగ్ లు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. దీని మీద మరింత సమాచారం అందాలసి ఉంది.