చంద్రబాబు రాయి ఎవరితో వేయించుకున్నాడో తేలుస్తామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెర తీశాడని.. చంద్రబాబు విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమన్నారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని..చంద్రబాబు తన పై తానే రాయి విసిరించుకున్నాడని ఆరోపించారు.
జగన్ దమ్మున్న నాయకుడని.. తనను అరెస్టు చేసి జైలుకు పంపించినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను చూరగొన్నాడని ఆగ్రహించారు. మా నాయకుడి లక్ష్యం 175 కు 175 అని.. మేము ఈ లక్ష్యం దిశగా పని చేస్తున్నామని వెల్లడించారు. అంతే కాని దిక్కు మాలిన చంద్రబాబు పై రాళ్ళు వేస్తామా?? ఒక పక్క రెక్కీ, రెండో పక్కేమో రాయన్నారు. పార్ట్ వన్ పవన్ కల్యాణ్ డ్రామా ఎపిసోడ్, పార్ట్ టు చంద్రబాబు డ్రామా ఎపిసోడ్, పార్ట్ త్రీ రేపు ఇప్పటం ఎపిసోడ్ అంటూ చురకలు అంటించారు జోగి రమేష్.