జానీ మాస్టర్ వివాదం..వారికి ఫిలిం ఛాంబర్ సెక్రటరీ హెచ్చరిక!

-

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికదాడికి సంబంధించిన వివాదం వైరల్ అవుతోంది. తనను చాలా కాలంగా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు అతని అసిస్టెంట్, మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. యాక్టర్లు చిన్మయి, అనసూయ, పూనమ్ కౌర్ వంటి నటులు ఇప్పటికే బాధితురాలకి ధైర్యం చెప్పడంతో పాటు జానీ మాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పని చేసే మహిళల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఇతర పరిశమ్రలతో పోల్చి చూస్తే చాలా ముందున్నామని తెలిపారు.మహిళా నటీనటులు పని చేసే ప్రదేశంలో వేధింపులు ఉంటే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. ఎంత పెద్దవాళ్లనైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version