ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. జమిలి ఎన్ని కలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి.
అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి. జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నామని వివరించారు. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలన్నారు. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి.