Bigg Boss Telugu 8 : డేంజర్ లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

-

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఉత్కంఠ భరతంగా సాగుతోంది. మూడో వారం నాటికి కంటెస్టెంట్లు ఆటపై అవగాహన రావడంతో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరు కంటెస్టెంట్స్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన 12 మంది కంటిన్యూ చేస్తున్నారు. ఓటింగ్ లో కింద ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషలలో ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు బయటకు వెళ్లాలో ఇంటి సభ్యులు డిసైడ్ చేసి ఆయనని పంపించేశారు. ఈసారి విష్ణు ప్రియ, నాగమణికంఠ ఓటింగ్ లైన్లో ముందున్నారు.

ఈసారి సోమవారమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. దీని వలన కంటెస్టెంట్స్ కి సరైన విధంగా ఓట్లు పడతాయని అంటున్నారు. మధ్యలో టాస్కులు ప్రవర్తన పరంగా కాంటెస్ట్ ఏ మాత్రం సత్తా చాటిన ఓటింగ్ బాగుంటుందని కామెంట్లు వస్తున్నాయి. ఎమోషనల్ డ్రామా ప్లే చేసిన మణికంఠ ఆటలో దూకుడని పెంచాడు. గతవారం డేంజర్ లో ఉన్న సీత ఈ వారం బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఓటింగ్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ప్రేరణ నాలుగో స్థానంలో ఉంది.

చీఫ్ గా వెలిగిపోతున్న యష్మి గౌడ అనూహ్యంగా ఓటింగ్ లో దిగజారిపోయింది తన ఆటిట్యూడ్ తో చీ కొట్టించుకుంటోంది. ఈ వారం నైనిక, అభయ్, పృథ్వి డేంజర్ లో ఉన్నారు. పృథ్వి ఫస్ట్ వీక్ నుంచి ఓటింగ్లో లీస్ట్ లో ఉంటున్నాడు. బిగ్ బాస్ సొంత స్క్రిప్ట్ వర్కౌట్ చేస్తుండడంతో బతికిపోతున్నాడు. అయితే నైనికా టాస్కులు అదరగొడుతోంది. కాబట్టి పృద్వి, అభయ్ లో ఒకరు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సెల్ఫ్ నామినేట్ అయిన అభయ్ ని గుడ్డు సహాయంతో నిఖిల్ సేవ్ చేస్తారని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version