ఒక పక్కన కుటుంబాన్ని నెట్టుకొస్తూ… మరో పక్క డ్యాన్స్ తో.. జోష్ క్రియేటర్ ప్రవీణ్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..?

-

జోష్ క్రియేటర్ అయినటువంటి ప్రవీణ్ చిన్నప్పుడే.. తన తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయారు దీనితో అతనికి, అతని తమ్ముడికి, తల్లికి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. దీనితో ప్రవీణ్ ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. న్యూస్ పేపర్ లని వేయడం, వాటర్ ప్యాకెట్లను అమ్మడం ఇలా ఎన్నో చిన్న చిన్న పనులు చేసేవారు. తర్వాత ఎలాగోలా తన చదువుని పూర్తిచేసుకుని తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ ని తీసుకుని స్టేజీల మీద పర్ఫార్మ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా డాన్సులు చేయడం వలన డబ్బులు సంపాదించలేకపోవడంతో ఆయిల్ కంపెనీ మొదలైన చోట పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు.

డాన్స్ స్టూడియోలలో డాన్స్ క్లాసులు చెప్పడం కూడా జరిగింది. కానీ కుటుంబం అంతా కూడా ఎన్నో కష్టాలని అనుభవించాల్సి వచ్చింది. ఒకరోజు కొరియోగ్రాఫర్ భూషణ్ మాస్టర్ అసిస్టెంట్ నుండి ఆయనకి ఫోన్ వచ్చింది. ఢీ షో లో ఆయనకి ఆఫర్ కి వచ్చినట్లు చెప్పారు ఇంత పెద్ద కాంపిటీషన్లో అవకాశం రావడం అదే మొదటిసారి. ఆ డాన్స్ షోలో చిరంజీవి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు.

ఎంతో నర్వస్ గా ఫీల్ అయ్యారు ప్రవీణ్. 200 మంది అందులో పాల్గొంటే ఫస్ట్ ప్లేస్ తనకి వచ్చింది. చిరంజీవి పర్సనల్ గా ఆయనకి అవార్డు ఇచ్చారు. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలు ప్రవీణ్ లో ఉండిపోయాయి. ఆయన చేసిన డాన్స్ మరియు ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అని చిరంజీవి చెప్పారు. అప్పటినుండి కూడా ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రవీణ్ డాన్స్ గురించి కుటుంబ సభ్యులకి తెలియదు అప్పట్లో ఫోన్లు కూడా లేవు .అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఈయన డాన్స్ ని టీవీలో చూసి ఆశ్చర్యపోయారు అప్పటినుండి కూడా ఈయనకి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. డాన్స్ చేయడమే కాకుండా కుటుంబం కి ఆర్థికంగా అండగా నిలచారు.

డాన్సర్ గా ఢీ షో కి అసిస్టెంట్ గా పని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈయనకి పేరు కూడా బాగా వచ్చింది. అయితే ఎప్పుడూ కూడా ప్రవీణ్ చిరంజీవి గారు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుంటారు. పార్ట్ టైం కింద డాన్స్ ని మొదలు పెట్టిన ఈయన ఫుల్ టైం కెరీర్ కింద డాన్స్ ని తీసుకున్నారు. 150కి పైగా డాన్స్ షోలలో పాల్గొన్నారు.

అలానే ఆయన స్నేహితులు రవి, క్రాంతి కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎంతగానో తనని సపోర్ట్ చేసారు. సొంతంగా డాన్స్ స్టూడియో ని కూడా స్టార్ట్ చేశారు ప్రవీణ్. తను అనుకున్న పొజిషన్ లో నిలబడ్డారు. పైగా ఇప్పుడు చాలామందికి ప్రవీణ్ ఆదర్శం. జోష్ ప్లాట్ఫామ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తుంది. జోష్ లో ప్రవీణ్ గత సంవత్సరం జూలైలో జాయిన్ అయ్యారు. 1.4 మిలియన్ ఫ్యాన్స్ ఈయనకి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version