తెలంగాణ, ఏపీని మళ్లీ కలపాల్సిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మేము తొలి నుంచీ పోరాడుతున్నామని..ఉండవల్లి పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఫైర్ అయ్యారు. అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ , బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైసీపీనేనని స్పష్టం చేశారు.
మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనేనని.. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి ,లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానమని.. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదని వెల్లడించారు. విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని.. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని సజ్జల పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.