కరోనా వైరస్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏమంటున్నారంటే?

-

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలోనూ విజృంభిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపుగా 110 మందికి కరోనా సోకింది. అందులో ఇద్దరు దుర్మరణం కూడా చెందారు. దేశమంతటా కరోనా తన ప్రభావాన్ని చూపుతూ ఉండగా.. తెలంగాణలోనూ పాకింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంది. జన సమూహం ఉండే ప్రదేశాలైన థియేటర్స్, కాలేజీలు, స్కూల్లు, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మార్చి 31 వరకు మూసి వేయాలని ఆదేశించింది. ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది.

 

టాలీవుడ్‌లో జరిగే షూటింగ్స్ అన్నింటిని రద్దు చేసింది. సినిమాలను వాయిదా వేసింది. సినీ ప్రముఖులందరూ కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు, సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. కరోనాను వ్యాప్తి చెందుకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించారు. ఎక్కువగా నీరు తాగాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని, అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలని తెలిపారు. షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version