రకుల్ ప్రీత్ సింగ్ సెక్సీగా ఉందే .. అదా మ్యాటరు …!

-

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ సినిమాలో హీరో సందీప్ కిషన్ కావడం తో రకుల్ టాలీవుడ్ లో సక్సస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కాని ఆ తర్వాత వరుసగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, గోపి చంద్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో ఒకానొక సందర్భంలో హైయ్యేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వెలిగిపోయింది. కానీ ఆ వెలుగు ఎంతకాలమో కొనసాగలేదు. వరుస ఫ్లాపుల తో టాలీవుడ్ లో తన ఇమేజ్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా మొదలుకొని రీసెంట్ గా నాగార్జున నటించిన మన్మథుడు 2 వరకూ వచ్చిన ఫ్లాప్స్ రకుల్ ని దారుణమైన పరిస్థితికి తీసుకు వచ్చాయి. దాంతో ప్రస్తుతం అమ్మడు ముంబైలో మకాం పెట్టేసింది. అక్కడ అజయ్ దేవగన్, టబు లతో కలిసి దే దే ప్యార్ దే అన్న సినిమాలో నటించి హిట్ దక్కించుకుంది. అందుకే ఇప్పుడు ఏదో ఒక ఫోటోషూట్ అంటూ అక్కడే సెటిలై హిందీ సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమా తో పాటు శంకర్, కమల్ హాసన్ ల భారతీయుడు 2 లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తప్ప మరే అవకాశము రకుల్ చేతిలో లేదు.

దాంతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ తో సెక్సీగా కనిపిస్తూ సోషల్ మీడియాలో కుర్రకారుకి బాగా టచ్ లో ఉంటుంది. అంతేకాదు మళ్ళీ టాలీవుడ్, బాలీవుడ్ ల లో ఛాన్సులు దక్కించుకోవాలని మేకర్స్ ని తన హాట్ ఫొటోస్ తో గాలం వేస్తోంది. అందుకే వీలైనంత పొదుగా బట్టలు వేసుకొని కుదిరినంతగా చూపించేస్తుంది. మరి మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ ని ఎవరైనా మేకర్స్ ఆదుకొని అవకాశం ఇస్తారా చూడాలి. ఏదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అవకాశాలకోసం చేస్తులు చాచే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం మాత్రం తనే.

Read more RELATED
Recommended to you

Exit mobile version