మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `సైరా నరసింహారెడ్డి` చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని కసరత్తులు చేస్తున్నారు. గ్రాఫిక్స్ పనులు కొన్నింటిని విదేశాల్లో పూర్తిచేస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మెగాస్టార్-సూరి తర్జన భర్జన పడిన సంగతి తెలిసిందే. ఏ.ఆర్ రెహమాన్ హ్యాండ్ ఇవ్వడంతో ఎవర్ని ఎంపిక చేయాలో తెలియన సందిగ్ధంలో పడి చివరికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని రంగంలోకి దించారు. అయినా అమిత్ చేయగలాడా? లేదా? అని బోలెడన్ని సందేహాలు వెంటాడాయి.
వాటన్నింటిని టీజర్ తో అమిత్ చెరిపేసాడు. టీజర్ కు అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చి అదరగొట్టేసాడు. దీంతో మ్యూజిక్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకునే పనిలేదన్న నమ్మకం మెగాస్టార్ కు కల్గింది. అందుకే అమిత్ నే పాటల సహా రీరికార్డింగ్‌కి ఫైనల్ చేసారు. తాజాగా అదనంగా రీరికార్డింగ్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుంటున్నట్లు తెలిసింది. రిలీజ్ కు ఎంతో సమయం లేని నేపథ్యంలో నేపథ్య సంగీతం పనులన్నీ అమిత్ ఒక్కడే పూర్తిచేయాలంటే వెనుక సపోర్ట్ కూడా అసవరమని భావించి జూలియస్ పకీమ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారుట. ఇతను మామూలోడు కాదు. వెరీ ట్యాలెంటెడ్. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `భజిరంగి భాయిజాన్` కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్‌ను అందించాడు.
ఆ సినిమా ఆర్ ఆర్ సహా మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. అందుకే అతని పనితనం మెచ్చి జూలియస్ పేరును అమిత్ సూచించడంతో అతన్ని తీసుకున్నారని సమాచారం. ఇకపై నేపథ్య సంగీతం కు సంబంధించిన పనులన్నింటినా ఆయన చూసుకుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం జూలియస్ బాలీవుడ్ లో చాలా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. కానీ అమిత్-చిరు రిక్వెటస్ చేయడంతో సమయం కేటాయించి కమిట్ అయినట్లు చెబుతున్నారు. అందుకు గాను పారితోషికం కూడా భారీగానే ఆఫర్ చేసారుట.