వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది..రైతు బంధు ఎక్కడా ? – కేటీఆర్‌

-

వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది..రైతు బంధు ఎక్కడా ? అంటూ కేటీఆర్‌ నిలదీశారు. యాసంగి పోయి -వానాకాలం వచ్చిందని… వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చిందని కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడని… నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడని మండిపడ్డారు. రుణం తీరక,కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండని… రైతుభరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదని ఆగ్రహించారు.

రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి… రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి .. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారని నిప్పులు చెరిగారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారు… రూ.12 వేల రైతుభరోసా కోసంరైతుకూలీలు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. రెండు పంటలకేనా రైతుబంధు ? మూడో పంటకు ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు అంటూ చురకులు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version