బీఆర్ఎస్ MLA లను తీసుకోవలసిన పని మాకు లేదు: జూపల్లి కృష్ణ రావు

-

కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని చెప్పారు. ఎంపీ సీట్లు అయినా రాకపోతాయని చూస్తున్నట్లు చెప్పారు. బావ బామ్మర్ది తిక్క వాగుడు మానుకోవాలని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసేసారు. దోపిడీ కబ్జాదారులు అనే కదా వాళ్ళని ఓడించింది అని కీలక వ్యాఖ్యలు చేశారు జూపల్లి కృష్ణారావు.

అలానే బిఆర్ఎస్ కి రెండు మూడు సీట్లు వస్తాయి ఏమో అంతే అని జూపల్లి కృష్ణారావు చెప్పారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో వలసలకి తెరలేపుతోంది అని అన్నారు. అలానే బిఆర్ఎస్ నేతలు సొంత పార్టీని విడిచిపెట్టి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ పై మండి పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version