సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ పాటల ద్వారా కేరళ బాధితుల కష్టాలను తెలుపుతూ.. మీకు అండగా మేం ఉన్నాం అంటూ వారికి భరోసా ఇచ్చారు. కేరళ వరద బాధితుల సహాయార్థం కేరళకు చెందిన ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడి సీఎం విపత్తు సహాయ నిధికి విరాళాలు సేకరించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్. కె.ఎం. జోసెఫ్ లు సుప్రీం కోర్టు అవరణంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విడివిడిగా పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర, పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు హజరయ్యారు. సుప్రీం న్యాయమూర్తులు ఒక్కొక్కరు రూ.25వేల చొప్పున సాయం అందజేయగా, అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోటి రూపాయలు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రూ. 50 లక్షలు ప్రకటించారు.