హైదరాబాద్‌కు జస్టిస్ పినాకి చంద్రఘోష్.. కాళేశ్వరంపై తదుపరి విచారణ ప్రారంభం!

-

కాళేశ్వరం కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో నేటి(గురువారం) నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లోని అవకతవకలపై తదుపరి విచారణ ప్రారంభం కానుంది.విచారణలో భాగంగా పలువురు ఇంజనీర్లు, అధికారులు సమర్పించిన అఫిడవిట్‌లపై నేడు కమిషన్ విచారణ చేపట్టనుంది. అయితే, ఓపెన్ కోర్టుకు ఎవరిని పిలవాలనే దానిపై జస్టిస్ చంద్రఘోష్ ఓ నిర్ణయానికి రానున్నారు.

గతంలో ఓపెన్ కోర్టులో ఇంజనీర్లు, అధికారులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించగా.. ఇప్పుడు ఆ టైంను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఇక కమిషన్ ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయనుంది. అనంతరం వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లు సమాచారం. కాగా,కాళేశ్వరం ఎత్తిపోతల అవకతవకలపై గత ఏప్రిల్‌లో కాంగ్రెస్ సర్కార్ కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించగా.. గతేడాది అక్టోబర్ 22న మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, ప్రాజెక్టు డిజైన్లు, మిషనరీ ఇతర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్ల వాంగ్మూలాలను కమిషన్ సేకరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version