Justin Langer: ఐపీఎల్‌ ట్రోఫీ గెలవకుంటే గొప్ప కోచ్‌ కాలేవు: లక్నో ఓనర్‌పై కోచ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్….

-

ఐపీఎల్‌ లో వచ్చే సీజన్‌ నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆసీసీ మాజీ క్రికెటర్‌, కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు . లక్నోజట్టు విడుదల చేసిన ఓ వీడియోలో క్రికెట్‌ కోచ్‌గా ఎన్ని టోర్నీలు గెలిచినా ఐపీఎల్‌లో ట్రోఫీ గెలవకుంటే అసలు గొప్ప కోచ్‌ కాలేరని సంజీవ్ గొయెంకా అన్నాడని.. అదే తనకు స్ఫూర్తినిచ్చిందని జస్టిన్ లాంగర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

వీడియోలో లంగర్‌ మాట్లాడుతూ…. నేను పెర్త్‌లో ఉన్నప్పుడు. సంజీవ్ గొయెంకాతో మీటింగ్‌ చాలా ఫన్నీగా జరిగింది. లక్నో ప్రతినిధి నుంచి లక్నో ఓనర్‌ సంజీవ్ గోయెంక నన్ను కలవాలని మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత నేను గొయెంకాను కలిశాను. గోయెంకలో సేల్స్‌ మెన్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మా మీటింగ్‌ అయినా తర్వాత ఆయన నాతో.. ‘చూడు జస్టిన్‌.. నీకు ప్లేయర్ గాఅద్భుతమైన కెరీర్‌ ఉంది. అంతేగాక కోచ్‌గా కూడా నువ్వు మంచి సక్సెస్‌ అయ్యావు. కానీ ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేదాకా నువ్వు గొప్ప కోచ్‌వి కాలేవు..’అని అన్నాడ’’ని వెల్లడించాడు.లక్నో సూపర్ జైంట్స్ కు హెడ్‌కోచ్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని, వచ్చే సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని లంగర్‌ అన్నాడు. అంతేగాక ఐపీఎల్‌ అంటే ఒలింపిక్స్‌ లాంటిదని, ప్రతి మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని జస్టిన్ లంగర్‌ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version