కంగనా రనౌత్ నటనకు నేను వీరాభిమానిని : జ్యోతిక

-

గతంలో తమిళ్ దర్శకుడి పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు లాంటి నటీనటులు చేసిన చిత్రం “చంద్రముఖి”. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ను తీయాలని ఎంతో ప్రయత్నించినా వీలు అవలేదు. అయితే తాజాగా “చంద్రముఖి 2” ను పి వాసు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో రజినీకాంత్ నటించడం లేదన్నది తెలిసిన విషయమే.. కానీ దర్శకుడు హీరో మరియు డ్యాన్సర్ అయిన రాఘవ లారెన్స్ ఇందులో వేంకటపతి రాజాగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వినాయకచవితికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కాగా చంద్రముఖిలో నటించిన జ్యోతిక ఈ సినిమాలో నటించిన కంగనా రనౌత్ గురించి ప్రశంసల జల్లు కురిపించింది.

దేశంలోనే ప్రసిద్ధి గాంచిన నటీనటులతో ఒకరు అయిన కంగనా చంద్రముఖి పాత్రలో నటించడం గర్వంగా ఉందన్నారు. చంద్రముఖి గా కంగనా సరిగ్గా సూట్ అయిందని ఈమెకు నేను వీరాభిమానినంటూ జ్యోతికి పొగడ్తలతో ముంచెత్తింది. సినిమాకు మరియు కంగనాకు ఆల్ ది బెస్ట్ అంటూ జ్యోతిక చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version