ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని సర్పంచ్లు సైతం అంటున్నారని బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కామెంట్స్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం బాధాకరం అన్నారు. ఆమె కుటుంబానికి సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు దిగ్విజయంగా జరుగుతున్నాయని అన్నారు.
అలానే ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది అని అన్నారు ఈరోజు వరకు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయిందని చెప్పారు. దేశం కోసం మోడీ మోడీ కోసం మేము అని ప్రజలు అంటున్నారని చెప్పారు. దివ్యమైన రామాలయం కట్టిన మోడీని మేము ఎలా కాదంటాము అని అంటున్నారు అని లక్ష్మణ్ చెప్పారు