అకాల వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నక్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ని సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం.. ఓ వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా.. కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎస్పీతో నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాతే తనపై దాడి జరిగిందని అన్నారు. తొలుత 15 నుంచి 20 మంది పోలీసులు వచ్చారని, ఆ తర్వాత డీఎస్పీ, సీఐ వచ్చారని… అనంతరం తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూటూత్ తో మాట్లాడారన్నారు.
ఆ తర్వాత తనపై దాడి జరిగిందని చెప్పారు. తనపై దాడి చేసింది కేటీఆర్ మనిషేనని కేఏ పాల్ అని ఆయన ఆరోపించారు.. అంతే కాకుండా. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 28 స్థానాల కంటే ఎక్కువ రావనే విషయాన్ని కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టు పీకే అన్నారని కేఏ పాల్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ను స్వంత పార్టీ పెట్టమని చెప్పింది కూడా కేసీఆరే అని కేఏ పాల్ వెల్లడించారు.