కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేఏ పాల్

-

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకుందని.. ప్రజాశాంతి పార్టీని ఈసీ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిందంటూ ఓ వార్త చెక్కర్లు కొట్టింది. దీనిపై ఇటీవల కేఏ పాల్ క్లారిటీ కూడా ఇచ్చారు. దీన్ని ఒక ఫేక్ న్యూస్ గా ఆయన అభివర్ణించారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 89 పార్టీలని తమ జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతిని కూడా తొలగించినట్లు జోరుగా ప్రచారం సాగింది.

దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న కేఏ పాల్ కు భారీ షాక్ తగిలినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీ రద్దు కాలేదని స్పష్టం చేశారు. ఇనాక్టివ్ గా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని తెలిపారు. మునుగోడు లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు కేఏ పాల్. హెలిక్యాప్టర్ సింబల్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version